శూన్య సంగీతం

by K.S.M.Phanindra

నిశ్శబ్దంలోకి నేను జారిపోతున్నాను

ఏదో అగాధంలోకి

తెలియని శూన్యంలోకి

జారిపోతూనే ఉన్నాను

 

ఆలోచనల కీచురాళ్ళ రొదని

దాటానో లేదో

శూన్యంలో కొత్త సంగీతం పలకరిస్తోంది

 

లోకం నక్షత్రాలని ఏరుకుంటోంది

ఆకాశం జాలిగా చూస్తోంది

చందమామ నిశ్చలంగా నవ్వుతున్నాడు

నేను వెన్నెల నిచ్చెన ఎక్కి దిగంతాల్లోకి వ్యాపిస్తున్నాను

 

ఈ అస్పష్ట అనుభూతి అస్పష్టంగానే ఉండాలి

తెలియనితనంలో ఉన్న ఆనందం తెలుసుకోడంలో లేదు

హృదయసమాధిలోంచి ఏవో ప్రశ్నలు దెయ్యాల్లా లేచివస్తున్నాయి

నేను మాత్రం ప్రశ్నకి అందని ప్రశ్నలా..