నీలో నువ్వు
by K.S.M.Phanindra
నిన్ను నువ్వు తెలుసుకోవడం అంత సులువేమీ కాదు
కన్నీటిచుక్కకీ ఆనందభాష్పానికీ తేడా తెలియడం వేరు
కన్నీటిచుక్కగా, ఆనందభాష్పంగా మారడం వేరు
మనకి దేనిలోనైనా సంపూర్ణంగా మునగడం చేతకాదు
ఈదలేమనో, తిరిగి రాలేమనో, దేన్నో కోల్పోతామనో….ఏదో భయం
నీ ఉనికి కరిగేంతలా నిమగ్నమైనప్పుడే
తెలుసుకోవడం అంటూ మొదలౌతుంది
అద్దంలో తన రూపాన్ని సరిగ్గా చూడలేనివాడు
ఎంత గొప్ప చిత్రకారుడైనా జీవితాన్ని చిత్రించలేడు
నిజమైన నగ్నత్వం అంటే
అది బట్టలు విప్పడంలో లేదు
దుస్తులు తొడుక్కోకపోవడంలో ఉంది
ఎందుకంటే ద్రౌపదీవస్త్రాపహరణ ఘట్టం లాగ
విప్పుతున్న కొద్దీ బట్ట వస్తూనే ఉంటుంది…
Dear phani….
glad to see the lines from you ….
where did the third stanza come from—all of a sudden ?? It is good by itself but i could not comprehend it in connection with the above two stanzas.
బాగుంది నీ నిర్వచనం.
“మనకి దేనిలోనైనా సంపూర్ణంగా మునగడం చేతకాదు”
ఈ నిజం నాకు బాగా నచ్చింది.
చాలారోజుల తరువాయి ఇక్కడొక కవిత పెట్టినట్టున్నావు సోదరా. తరచూ రాస్తుండు
సూపర్…
‘నీ ఉనికి కరిగేంతలా నిమగ్నమైనప్పుడే
తెలుసుకోవడం అంటూ మొదలౌతుంది’
నాకు ఈ వాక్యాలు చాలా చాలా నచ్చేశాయ్
May you think deeper, grow taller and share your wisdom with us !! You are blessed to be a channel through which these thoughts have flown out.