ఈ బ్లాగు గురించి

ఈ బ్లాగులో నా కవితలు లాంటి రాతలు పెట్టడం జరిగింది. ఇవి చదవడం మీకు శిక్షే కాబట్టి ఈ బ్లాగుకి “అక్షర శిక్షలు” అనే సార్థక నామధేయం పెట్టాను.

ఒక నిజం చెబుతాను. నాకు కవితలు రాయడం రాదు. “మరైతే ఈ రాతలు రాసి మమ్మల్ని ఎందుకు చంపడం?” అని మీరు అడగొచ్చు. దీనికి సమాధానం – “నాకు కవితలు రాసే talent పెద్ద లేకున్నా, బాగా రాయాలనే ఆసక్తీ, తపనా ఉండడం వల్లా, పాఠాలు నేర్చుకుని, నా తప్పులు దిద్దుకునే తత్త్వం ఉండడం వల్లా, నేను రాసిన చెత్తతో ఇంతమంది ముందుకి రావడం. సలహాలూ, సూచనలూ చెబుతారని. మీ విమర్శలతో నన్ను సానబెడతారని. నేను రాసుకున్న రాతలు ఇలా బ్లాగులో చూసుకోవాలని ముచ్చటపడడం కూడా కొంత కారణం అనుకోండి!”