చూపుల్తో గాలం వేస్తా!
ఇద్దరు మిత్రులతో కలిసి నితిన్ నటించిన హీరో అని సినిమాకి కొన్ని పాటలు రాయడం జరిగింది. మా పాటలు తీసుకోలేదు అనుకోండి, అది వేరే విషయం! ఈ సినిమాలో ఒక item song ఉంది. సందర్భం అంత ఉదాత్తమైనది ఏమీ కాదు – హీరో పోలిస్ అకాడెమీ లో ఉంటాడు. వాళ్ళ హాస్టల్ మెస్ లో ఒక అమ్మాయిని తెచ్చుకుని అంతా ఆడీ పాడీ చిందెయ్యడం. నేను సిరివెన్నెలని తలచుకుని, అసభ్యత లేకుండా కొంత భావం ఉండే ప్రయత్నం చేస్తూ రాసిన పాట ఇది. మాకు చెప్పిన సందర్భంలో నటుడు “బ్రహ్మానందం” కూడా ఈ పాటలో అమ్మాయి పక్కన dance చేస్తాడు. అందుకే రెండో చరణంలో నటుడు బ్రహ్మానందం, అమ్మాయి అందమే నిజమైన ఆనందం అనే భావం, ఇలా రెండూ స్ఫురించేలా సరదాగా ఒక వాక్యం రాశాను!
పల్లవి:
ఆమె: చూపుల్తో గాలం వేస్తా లోకాన్నే ఆటాడిస్తా చిందుల్తో చిత్తే చేస్తాగా
కాలాన్నే కళ్ళెం వేస్తా నావంకే మళ్ళించేస్తా సొంపుల్తో మంత్రం వేస్తా
సై అంటే సిద్ధం అవ్వరా
నా చుట్టూ కోటే కట్టరా
రై అంటూ దూకే తొందరా
నా వెంటే రమ్మంటుందిగాఅతను: మెస్లోన మిస్సుంది మిస్ కాకురా
కోరస్: కుర్రకారే కొంటెతీరే గంతులేసేనే
హద్దుమీరే అల్లరేదో సద్దుచేసేనే(పల్లవి repeat)
ఆమె: చూపుల్తో గాలం వేస్తా లోకాన్నే ఆటాడిస్తా చిందుల్తో చిత్తే చేస్తాగా
అతను: పోటిగా నేనే వస్తా నాటితో నాట్యం చేస్తా స్టెప్పుల్లొ స్టైలవ్వనాచరణం 1:
ఆమె:వానల్లో వరదల్లో వాగుల్లో వంకల్లో జోరేదొ చూపించనా
తేలించి తాపంలో ముంచేసి మైకంలో స్వర్గాన్ని దించెయ్యనా
అతను:నీ అందాలే ఎదురైతే వలవేసుకోమా
సరదాగా సాయంగా ఈలెయ్యమా
ఆమె:కాదన్నానా కన్నా రా తలదాచుకోరా
తందానా తిల్లానా పాడెయ్యరా
అతను:పాడేసి ఆడేసి జోడవ్వనాకోరస్: కుర్రకారే కొంటెతీరే గంతులేసేనే
హద్దుమీరే అల్లరేదో సద్దుచేసేనేచరణం 2:
ఆమె:మారాజులైతేనేం మారాముకొంతేలే మావెంట పడతారులే
మనసన్న మాటేలే ముసుగేసుకుంటారే సొగసంటే దాసోహమే
అతను:హీరోలైనా విలనైనా ఎవరైన కానీ
డంగయ్యి అమ్మాయీ చెయ్యందరా
ఆమె:బ్రహ్మానందం భామందం ఒకటేలే బాసూ
బ్రహ్మాండం అనిపించే విందివ్వనా
అతను:విందుల్లో పొందుల్లో చిందెయ్యనాకోరస్: కుర్రకారే కొంటెతీరే గంతులేసేనే
హద్దుమీరే అల్లరేదో సద్దుచేసేనే