నాలుగేళ్ళు…

నాలుగేళ్ళు నాలుగు నిమిషాల్లా గడిచిపోయాయి!
మధుర జ్ఞాపకాలను మదికి కానుకిచ్చి పోయాయి
ఏ బంధమో మరి
మనల్ని తెచ్చి కట్టి పడేసింది
కల్మషమెరుగని స్నేహం
తీగలా అల్లుకుపోయింది

ఒకటా రెండా ఎన్నెన్ని స్మృతులు…
కడలిపొంగును తలదన్నే తుళ్ళింతలు
నింగి సైతం దద్దరిల్లే కేరింతలు
కాలం తెలియని కబుర్లు
తుంటరిగా చేసిన అల్లర్లు
అలుపెరుగని ఆటపాటల సందళ్ళు
కుర్రతనం తొక్కిన పరవళ్ళు
కన్నెపిల్లల కొంటె నవ్వులు
మనసులో వలపు దివ్వెలు
కనులు తెరిచి కలలు కన్న రోజులు
కలలలోని తీరలేని మోజులు
పాఠాలతో పడ్డ చికాకులు
సరదాగా కొట్టిన షికారులు
పరీక్షల ముందు కుస్తీలు
మిగతా వేళల్లో మస్తీలు
ఇంకా ఎన్నో…ఎన్నెన్నో

మళ్ళీ వస్తాయా ఈ రోజులు?
స్నేహమనే వెన్నెలలో స్నానమాడిన వేళలు
ఆత్మీయతల వెల్లువ ముంచెత్తిన ఘడియలు
ఇవన్నీ విడిచి వెళ్ళడమెలా?
మొరాయిస్తున్న మనసుని బుజ్జగించడమెలా?
బాధతో బరువెక్కిన గుండెను మోయడమెలా?
కనుపాపల కన్నీటి ధారలని తుడిచేదెలా?
ఈ స్నేహబంధాన్ని దాటి సాగడమెలా?

మిత్రమా!
వెళ్ళలేక వెళ్ళలేక వెళ్తున్నా
జ్ఞాపకాలని ప్రాణంగా చేసుకుని వెళ్తున్నా
మన స్నేహకుసుమం
విరబూస్తూనే ఉండాలి
స్నేహగంధాలని పంచుతూనే ఉండాలి
ఈ అనురాగపు జల్లు
కురుస్తూనే ఉండాలి
మనల్ని తడుపుతూనే ఉండాలి…

– 21.11.2001

(బీటెక్ అనుభవాల్ని గుండెల్లో నింపుకుని వీడ్కోలు తీసుకునే వేళ రాసింది)

ప్రకటనలు

4 Comments

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s