అమ్మ

ప్రపంచపు అనురాగం అంతా ఒక పదమైతే అది అమ్మ
“అ” అంటే అనురాగం
“మ”కార ద్విత్వం రెండింతల మమకారం

పూరెమ్మల కంటే సున్నితం అమ్మ మనసు
కలలలో సైతం చూడలేదు బిడ్డ కంట నలుసు
అమృతం పొంగి పొరలును ఆమె పిలుపులో
పిల్లల శ్రేయస్సుకై తపనలే ఆమె తలపులో

ప్రేమను పంచి బిడ్డని పెంచే తల్లి సేవ ఎవరికి సాధ్యం?
మన తొలి జ్ఞానం, జీవనయానం అమ్మ ఒడిలోనే ఆద్యం
ఇంతటి గొప్ప అమ్మ లేదనే కదా దేవునికి అసూయ
అందుకే అమ్మ కడుపున పుట్టి చూపుతాడు మాయ!

బిడ్డ ఎంత పెద్దైనా తల్లి కంటికి పసివాడే
జాగ్రత్తలూ హితాలూ చెప్పేందుకు తగువాడే
అమ్మ నోటి ప్రతి పలుకూ ఒక దీవెన
బ్రతుకు బాటలో వెలుగుకై శుభకామన

మహర్షుల, మహాత్ముల పుట్టుకకు అమ్మే కారణం
ఏమిచ్చి తీర్చుకోగలదు ధరిత్రి ఆమె రుణం?
ప్రపంచాన్ని అమృతమయం చేస్తున్న ఎందరో అమ్మలకు
శతసహస్ర వందనాలు జన్మజన్మలకు

— September, 1999

ఇది నేను రాసుకున్న మొదటి కవిత. అప్పట్లో జెమిని TV లో “అమ్మ” అనే సీరియల్ వచ్చేది.

అమ్మా ఓం నమామి
నిన్నే నే స్మరామి
దైవాలకన్నా దయ ఉన్న హృదయం
వేదాలకైనా వెలుగైన ఉదయం

అంటూ సాగే ఆ సీరియల్ Title Song (రచన: వేటూరి) స్ఫూర్తితో రాసుకున్న వాక్యాలివి.

అప్పట్లో వచనానికీ, కవిత్వానికి తేడ తెలియకపోవడం వల్ల, కవిత్వమే అనుకుని రాసిన వచనం ఇది. కొన్ని పొందిక లేని భావాలూ, ప్రాసల కోసం ప్రయత్నించడాలూ గమనించొచ్చు. భావాలు కూడా అరిగిపోయినవే దాదాపు. అక్కడక్కడా కాస్త నవ్యత ఉందేమో.

ప్రకటనలు

1 Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s