సువర్ణ భారతమా, వివర్ణ భారతమా?

ఈ మధ్య స్వాతంత్ర్య దినాన ఆలోచిస్తే పుట్టిన కొన్ని భావాలు ఇవి. ఈ రచనలో పెద్ద విశేషం ఏమీ లేకున్నా బ్లాగులో పెట్టాలనిపించింది:

వెలవెలబోయిందా భరత పతాక
కలవరపడుతోందా కలలే జారాక
ఎదలో జండా ఎగరేసి, ధర్మ చక్రం తానయ్యి వెలిగే మనిషన్న వాడు ఏడని?
తనలో దేశాన్నే చూసి, దేశం తనదని భావించి నడిచే వాడెక్కడున్నాడని?

బానిసత్వమంటే పంజర బంధనమా?
స్వాతంత్రమంటే విశాల పంజరమా?
బంగారు సంకెళ్ళేస్తే బందీలే కాదన్నట్టా?
వెన్నెల్లో వాసం ఉంటూ, పొద్దింక వద్దంటారా?
కలలో జీవిస్తూ ఉంటే, నిజమింక లేదన్నట్టా?
శిఖరాలే అధిరోహిస్తూ, నేలంతా వదిలేస్తారా?

గతమెంత ఘనమైనా ప్రస్తుతమేగా ప్రస్తుతము
నిన్నల్లో నిదురిస్తూ, రేపటి కోసం కలగంటూ
ఎదురయే నిజమేదో చూడని మరుపింకెన్నాళ్ళు?
నాకూ ఉందో సిద్ధాంతం, నీకూ ఉందో సిద్ధాంతం
యుద్ధం మన ఇద్దరి మధ్యా ఎందుకు?
నడిచే బాటే వేరైనా
కోరే గమ్యం ఒకటేగా
కలిసి పోలేమా చెప్పు ముందుకు?

ప్రకటనలు

1 Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s