ఎలక్షన్ల కోయిల!

అందరికీ “విరోధి” నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! మన విరోధం చెడుతో. మన వినోదం మంచితో!

ఉగాదికి ఏదైనా రాయడం అలవాటు. ఈసారి ఎలక్షన్లు కాబట్టి కవిత కొంత రంగు మార్చుకుంది.అదే కోయిల, అదే మావి చెట్టు కానీ వాటి interpretation మారింది –

ఎల కోయిల కాదిది, ఎలక్షన్ల కోయిల!
“హామీల” కొమ్మెక్కి హాయిగా కూస్తుంది
తీపి పాటల గాలమేసి
ఎండ”మావి” ఆమనిని అంటగడుతుంది

అసలు రంగు నలుపనీ తెలిసినా కూడా
కూతలకీ కోతలకీ చప్పట్లు ఎందుకో
ఆ ఉగాది పచ్చడి చేదని తెలిసినా
తినడమెందుకో, తిరిగి అనడమెందుకో

మనసు పుష్పించే మంచి పూలెన్ని?
కాయల్ని మనకిచ్చే మావి చెట్ట్లెన్ని?
చిగురుటాకులూ, చల్లగాలులూ అన్నీ తోట కోసమా?
తనకోసం తనే తెచ్చుకున్న ఆమని
మనదెప్పుడయ్యింది?

ఇప్పుడు,
మనకోసం కూసే మనదైన కోయిల కావాలి
మనకోసం పూసే మనదైన ఆమని రావాలి
కోటి గొంతులు కలిపి కొత్త కోయిల పుట్టాలి
గుండె గుండెలో ఆమని కోటలు కట్టాలి

ఇక,
చేతులు చాచి నింగి చెట్టుని అందుకోవాలి
మన “తారా ఫలాలు” మనమే తెచ్చుకోవాలి!

ప్రకటనలు

3 Comments

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s