నిత్య గీతిక

happy_birthday_candlesఎవరి పుట్టినరోజున వాళ్ళే కవితలు రాసుకోవడం సంప్రదాయం కాదేమో! అయినా Birthday Resolutions లా మనసుకి తోచినవి కొన్ని కవితగా రాసుకున్నాను. ఇవన్నీ “మనిషితనానికి” సంబంధించినవి కాబట్టి ఈ కవితలో మిమ్మల్ని మీరు చూసుకునే అవకాశమూ ఉంది.

జీవితం ఓ నిత్యగీతిక
మనం పట్టించుకోకున్నా
పాట సాగుతూనే ఉంటుంది
ఇన్నేళ్ళ నా ప్రస్థానమంతా
నా గొంతూ వినిపించాలని
ఒక తాపత్రయం

తరిగిపోయిన కాలాన్ని తరచి చూస్తే
గుప్పుమన్న పరిమళాలు కొన్ని
చప్పగా ఉన్న అనుభవాలు కొన్ని
వెరసి ఓ నేను

నిన్నటి పడమర నుంచీ
కొన్ని పాఠాలు ఏరుకుని
రేపటి వేకువని వెలిగించుకోవాలి!

బతుకు బండికి బాట చూపి
కలల గుర్రాలు కట్టుకుని కదలిపోవాలి

ప్రశ్నల పడవని దాటి
ఆచరణా నదిలో మునకలెయ్యాలి

మనసంతా పండుగలా
రోజూ పచ్చగా విరబూయాలి

నైరాశ్యాన్ని పీకి పారేసి
సామర్థ్యాన్ని స్థాపించుకోవాలి
జీవితాన్ని కొత్తగా శ్వాసించుకోవాలి

అందరి అద్దాల్లో నేనూ
నా అద్దంలో అందరూ
ఉండేలా అందంగా
బ్రతుకుని దిద్దుకోవాలి

నా పాటేదో
ముందు నేను తెలుసుకుని
గొంతెత్తి పాడుకోవాలి
కాలం ఆగి వినేలా…

ప్రకటనలు

17 Comments

 1. “నిత్యగీతిక” – ఎంత అందంగా ఉందీ పదం.!

  “నిన్నటి పడమర నుంచీ
  కొన్ని పాఠాలు ఏరుకుని
  రేపటి వేకువని వెలిగించుకోవాలి!”
  Beautiful..!!

  జన్మదిన శుభాకాంక్షలు. రాబోయే జీవితంలో మరెన్నో మధురమైన అనుభవాలు, అనుభూతులూ మీకు సొంతం కావాలని కోరుకుంటూ..

 2. జన్మదిన శుభాకాంక్షలు
  టైటిల్ బాగుంది.
  నిరాశాభావాల్ని పక్కన పెట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవాలి, కరక్టే. దాంతోబాటే మనం సర్వసమర్ధులం కాదనే వినయం కూడా నేర్చుకోవాలి.

 3. <>

  deenni virOdhaabhaasamanTaarO marEmanTaarO teliyadu kaanee… naaku baagaa nacchindi. manishitanamlO “sirivennela” velagaTam avasaram lEkunnaa aa vennela velugulO O kiraNaannaitE chaalunanukunE naaku “maaNikya”pu jilugullO kooDaa vennela rEkhalE kanipistE tappu naadi kaadu! 🙂

  chaalaa chakkagaa undi… marinta #regular#gaa vraastaavani aaSistunnaanu.

 4. bavundandi. Belated birthday wishes.

  mee kavita visleshinche anta anubhavam, gnanam levu naaku. kaani nakanipinchinid chepptunnaanu.

  అందరి అద్దాల్లో నేనూ
  నా అద్దంలో అందరూ
  ఉండేలా అందంగా
  బ్రతుకుని దిద్దుకోవాలి – idi nachindi.

  ప్రశ్నల పడవని దాటి
  ఆచరణా నదిలో మునకలెయ్యాలి – ee vaduka koncham ebbuttuga anipinchindi.
  a) acharanaa nadi – ee polika enduko ruchinchaledandi. idi meeru vaadaaru kabatti saraina prayogame ayi untundi anukuntunnanu. Idi varakoo evarannaa vaadaaraa idi?
  b)padava andaroo nadi(aacharana) datadaaniki vadite.. meeru padavanodilesi nadilo munagadam kottaga undi. Koncham visleshincharoo.

  నైరాశ్యాన్ని – ante aasayam lekapovadamaa? leka neraasagaa undadamaa??

 5. Vasu gaariki,

  naaku nacchina vaaDuka gurinchE mee praSna kanuka samaadhanam sOdaruDu Phanindra badulugaa nEnE istunnaanu. (taanu vacchinappuDu taanU istaaDEmO mari.)

  ikkaDa cheppinadi “aacharaNaa nadi” gurinchi… anTE aacharinchaTamE paramaavadhigaa soochinchina pOlika. aTuvanTappuDu “kulaasaagaa undi kadaa” ani praSnala paDavalOnE aagi unDipOka mana pani paDavalO unDaTam kaadani, nadilO digaTamani grahinchamani kavi soochana. kaaLLu taDavakunDaa unnanta sEpU baagaanE unTundi… praSnala aasaraa kooDaa antE… asalu “praSnala paDava” unnadE “aacharaNaa nadi” daaTaDaaniki ani gamaninchakunDaa praSnalanE aalambana chEsukuni aagipOraadu… ani soochana.

 6. ప్రతి వాక్యం హృదయానికి హత్తుకొనేలా ఉంది.
  మీకు అభినందన పూర్వక జన్మదిన ( ఆలస్యంగా చూసాను … సారీ ! ) శుభాకాంక్షలు !
  మీ రాశి ” Leo ” … అందుకే ఇంత అందంగా స్పందించగలరు.
  అన్నట్టు, మీ పుట్టిన రోజు, డా. సి. నారాయణ రెడ్డి గారి పుట్టిన రోజు ఒక రోజే !
  మీరూ అంతటి శిఖరాలను అధిరోహించాలని నిండు హృదయంతో అభిలషిస్తున్నాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s