ఆకలి నేర్పిన పాట

Song of poverty
Song of poverty

(Photo by Remusse of Flickr, used under Creative Commons license)

(MMTS లో వెళ్తున్నప్పుడు చంకన ఒక చంటి బిడ్డని, పక్కన ఒక చిన్న కుర్రాడిని వేసుకుని పాట పాడుకుంటూ యాచిస్తున్న ఒకామెను చూసినప్పుడు కలిగిన స్పందన)

ఆమె సుశీలో జానకో కాదు
అయినా శ్రుతి తప్పిన జీవితాన్ని
తన పాటతో శ్రుతి చెయ్యడానికి ప్రయత్నిస్తోంది

పాట ఆమెకి లగ్జరీ కాదు
ఆనందమూ కాదు, ఆత్మసంతృప్తీ కాదు
పాట ఆమెకి అన్నం పెట్టే పంట
మూసుకుపోయిన దారుల్లో
మిగిలిన ఏకైక బాట

ఆకలి ఆమెకి గురువు
నిరాశ సహాధ్యాయిని
కష్టం కన్నీరూ జంట స్వరాలుగా
జీవితం గీతంగా
శోకంతో లోకంతో
ఆమెకి నిత్యం సంగీత సాధనే

చంకన ఉన్న పాలు తాగే పసిపాప
ఆమె పాటకి పల్లవి
చెంతగా చేయూతగా నడుస్తున్న చంటి బాలుడు
ఆమె పాటకి చరణం
ఈ పల్లవీ చరణాల కోసమైనా
ఆమె పాట సాగాలి

అద్వైత సిద్ధికీ అమరత్వ లబ్ధికీ
గానమే సోపానము అన్నదే నిజమైతే
పాపం తనకి తెలియకుండానే
ఈ రెంటినీ ఆమె పొందింది
రెండో వాడెవ్వడూ తోడు లేకపోవడంలో అద్వైతాన్నీ
చావుగా మారిన బ్రతుకులో కొత్త అమరత్వాన్నీ
రోజూ ఆమె చూస్తోంది

ఆమె కోరుకునేది ఒక్కటే
నాబోటి వాడు తన గురించి
కవితలు రాయడం కాక
ఓ పదో పాతికో పడేస్తే బాగుణ్ణని….

ప్రకటనలు

14 Comments

 1. first choosi napudu…………..ee madhya blog lo ilantivi baaga raastunnaru asalu emaina help chestunnara ani..anipinchindi.idi alantide anipinchindi but ……….i convinced what u wrote at last

  ఆమె కోరుకునేది ఒక్కటే
  నాబోటి వాడు తన గురించి
  కవితలు రాయడం కాక
  ఓ పదో పాతికో పడేస్తే బాగుణ్ణని…

  excellent anna

 2. first choosi napudu…………..ee madhya blog lo ilantivi baaga raastunnaru asalu emaina help chestunnara ani..anipinchindi.idi alantide anipinchindi but ……….i convinced with what u wrote at last

  ఆమె కోరుకునేది ఒక్కటే
  నాబోటి వాడు తన గురించి
  కవితలు రాయడం కాక
  ఓ పదో పాతికో పడేస్తే బాగుణ్ణని…

  excellent anna

 3. BTW, some more comments that I forgot to add:

  * pallavi (chiguru) charaNam (paadam) anna arthaalalO anvyayam bahu chakkagaa saripOyElaa vraasaavu. Kudos to you! 🙂
  * advaita siddhi, amaratwa labdhi annappuDu paraakaashTaku chErindi bhaavam. naaku chaalaa nacchindi. 🙂
  * vastuvulO SreeSree vraasina “bhikshu varshiiyasi” gurtuku vacchinaa naDipinchaTamlO ekkaDaa aa pOlika teesukuraakunDaa neeku kaligina spandanani chaduvutunna naalOnU prasphuTamgaa kaliginchaavu… idi saarvajaneenamE anukunTunnaanu. kavi tanalOni spandananE paaThakuDilO kaliginchagalagaTam jarigitE poortigaa kRtakRtyuDainaTTE! Keep it up. 🙂

 4. SreeSree kavita nuvvu chadivi unDavani nEnu oohinchaanu. 🙂 Emii chadavakunDaa spandinchi vraastEnE swacChamaina bhaavaanikE sontamaina padaala flow vastundi ee kavitalOlaa… nee takkina vraatallOlaa. vaaTiki paata pOlikalu, vaasanalu raakunDaa choosukOvaTam aa vaasanalu telisina vaaLLa gOla… nEnu chadivina ati takkuvalO kooDaa aa gOla entO naaku telusu 😦

  1. Annaa,

   Thanks for your appreciation! Your encouragement is really motivating!

   Pallavi, charaNam anvayam nEnu nijaaniki anukOlEdu. nuvvu cheppaakaa naakuu telisindi 🙂

   Sree Sree kavita nEnu chadavalEdu. asalu ekkuva kavitalu chadavakapOvaDam valla evari influence anta lEdu. kaanii inkaa nErchukOvalasindi entO undi. marinta chakkagaa raayaDaaniki prayatnistaanu.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s