బావిలో చందమామ

ఆలోచనకీ, ఆచరణకీ చాలా అంతరం ఉంటుంది. తెలిసినంత మాత్రాన చెయ్యాలని ఏమీ లేదు. రోజు exercise చేస్తే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు, కానీ చేసే వాళ్ళు కొద్ది మందే! ideas, ఊహలూ అందరికీ ఉంటాయి. ఇలా చెయ్యాలనుకున్నవన్నీ చెయ్యగలగడం గొప్ప విజయం. అనుకున్నవి సాధించినా, సాధించకపోయినా నా వంతు పూర్తి ప్రయత్నం చేశాను అనుకోవడం కూడా పెద్ద సంతృప్తి. ఇది అందరికీ ఉండదు… నా వరకూ నేను ఎక్కువగా ఆలోచనలోనే ఉంటూ, ఆచరణలో పెట్టడంలో ఘోరంగా విఫలమవుతూ ఉంటాను. ఇది నాలో నాకు నచ్చని అంశాల్లో ఒకటి. ఎంత ప్రయత్నిస్తున్నా అంత మార్పు రావట్లేదు నాలో. అందుకే ఈ విషయంలో నన్ను నేనే తిట్టుకుంటూ, ఓదార్చుకుంటూ, ఉత్సాహపరుచుకుంటూ ఉంటాను. ఇలాంటి ఒక తరుణంలో పుట్టిన ఒక కవిత –

moon-on-water
బావిలో చంద్రుని ప్రతిబింబం
తోడుకోవాలంటూ తపన పడుతున్నాను …
నింగిలో చందమామ నవ్వుతున్నాడు

ఇంట్లో కూర్చుని కవిత రాస్తున్నాను
వెన్నెల సొగసుల గురించి…
బయట పండు వెన్నెల కురుస్తోంది

నిన్నటి క్షణాన్ని తలచుకుంటూ
రేపటి ఊహని వెతుకుతున్నాను…
ఇప్పటి క్షణం జారిపోతోంది

ఏం చెయ్యాలని ఆలోచిస్తూ
కలలోనే గమ్యం చేరుతున్నాను…
పాదం అడుగులేయడం మరిచిపోతోంది
ప్రకటనలు

1 Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s