“ప్రజా” రాజకీయం!

అరె భాయ్!
రాజకీయ నాయకులు మనతో కలవడమేంటి చిత్రంగా?
ప్రజా సంక్షేమం కోసం పోరాడ్డం ఏంటి విడ్డూరంగా?
పార్టీలూ జండాలు మనకోసం పక్కన పెట్టేశారా!
సెహభాష్! దండలు వెయ్యాల్సిందే!

Yes!
రెక్కాడితే కానీ డొక్కాడని
పాలమూరు కూలీ
రోజూ అన్నం దొరుకుతుందా లేదా
అన్నదే సమస్య అనుకుంటున్నాడు
What an ignorance!
సమస్య తెలంగాణ రాష్ట్రం లేకపోవడం అనీ
ఆంధ్రోళ్ళే అన్యాయం చేశారనీ
వాడి కళ్ళు తెరిపించాల్సిందే!
జై KCR!

అవునూ తెలియక అడుగుతున్నా..
ఇన్నాళ్ళూ మన తెలంగాణ మంత్రులు ఏం చేశారు?
తెలంగాణ అభివృద్ధికి వచ్చిన నిధులేమయ్యాయ్?
దోచుకుతిన్నది బడా నాయకులైతే మధ్యలో అంధ్రా సామాన్యుడు ఏం చేశాడు?
ఇడ్లీ సాంబార్ చేసిన పాపం ఏమిటి?
అసలు పనే చెయ్యని రాజకీయ నాయకుడు
రాజీనామా చేస్తే ఎంత చెయ్యకపోతే ఎంత?

ఏంటీ silly questions?
తుడిచెయ్ తుడిచెయ్!
మనకి ఆత్మగౌరవం ముఖ్యం!
చరిత్ర ముఖ్యం!
అప్పుడు విడిపోతామంటే కలుపుకున్నారు
దగా చేశారు
ఇప్పుడు విడిపోవాల్సిందే!
ఈ నేల మనదిరా, హైదరాబాద్ మనదిరా!
ఆంధ్రోడు ఎవడురో, వాడి పీకుడేందిరో!!

కరెక్టే! మరి ఈ నేల మాది, ఈ గుడి మాది
చరిత్రలో అలాగే ఉంది
అని గతంలో ఒకడు మసీదు కూలగొట్టి
మత విద్వేషాలు రెచ్చగొడితే
వాడిది తప్పన్నారుగా!

వాడిది తప్పే! మనది కాదు!
ఎందుకంటే మనం అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం
శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నాం
కొంచెం ఆవేశం వస్తే బస్సులూ అవీ తగలబెడతాం అంతే!
ఎవరైనా అడ్డొస్తే ప్రేమగానే నరికేస్తాం!
యుద్ధం చేసైనా సరే తెలంగాణ శాంతి కపోతం ఎగరేస్తాం!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!

అంధ్ర” అంటే అర్థం “తెలుగు” అట!
అంధ్ర ప్రదేశ్ అంటే తెలుగోళ్ళ రాష్ట్రం అనట!
తెలంగాణ వాళ్ళు అన్నా తెలుగు మాట్లాడే వాళ్ళనే అర్థంట!
అంటే మనం మనం ఒకటి కాదా?

కాదు, కాకూడదు!
వాళ్ళ తెలుగు వేరు, మనది వేరు
వాళ్ళ పండగలు వేరు మనవి వేరు
కలుపుకున్నట్టే కలుపుకుని ద్రోహం చేసారు!
మన గడ్డ సంస్కృతి కాపాడుకోవాలి!
దేశమంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అని ఎవరో ఆంధ్రా కవి అన్నాడు!
తరతరాలుగా మనని ఇలాగే trap చేశారు!

సరే! ఇన్నాళ్ళూ రాజకీయ నాయకులని తిట్టుకున్నామే!
వాళ్ళు ఇంతలో గొప్పోళ్ళు ఎలా అయిపోయారు?

అంధ్రా నాయకులు స్వార్థం కోసం సమైక్య ఉద్యమం సృష్టించారు!
మన నాయకులు నిజమైన ఉద్యమం చేస్తున్నారు!
ఇప్పటిదాక మన కోసం ఏమీ చెయ్యలేదు కానీ
తెలంగాణ వస్తే చేస్తారు!
వాళ్ళు తెలంగాణ ముద్దు బిడ్డలు!
ఒకే గొడుగుకిందకి వచ్చారు
రేపు వర్షం వెలిశాక కూడా కలిసే ఉంటారు!
అందుకే అమృతం వచ్చే దాకా ఈ మథనం జరగాల్సిందే!
నాయకుల కోసం తెలంగాణ కోసం
ప్రాణాలైనా అర్పిద్దాం విషమైనా తాగుదాం!

బ్రదర్! one last question!
మథనం అంటే గుర్తొచ్చింది!
పురాణ కథలో
అమృతం తన వాళ్ళకే పంచినట్టు
రాజకీయ మోహిని మనని మోసం చేస్తే
అప్పుడే ఉద్యమం చేస్తాం?

???

ప్రకటనలు

7 Comments

 1. Chaala andamga sootiga rasaru.. Idi malli andhra valla kutra ani antaru lendi..

  “Moorkhasya chittam, Naram Na Ranjayati ” ani evaro andhra maha kavi annattu gurtu..

  Prajalu amayakulu(read as Moorkhulu)..evado vere desam nunchi vacchi dabbulu iste valla devude sarvaswam ani decide aipotaru..

  Reservation to chetagani vallu pedda padavulalo mottam samajanni nasanam chestunte chappatlu kodataru..

  Vellani samardhavantam ga upayoginchukune valle rajakeeya nayakulu…

  (This is my first response..sorry, I donno how to use telugu..)

 2. చాలా బాగా వ్రాసారు. నాకో అనుమానం మనలాంటి సామాన్యులు ఆలోచిస్తున్న విధంగా అసలు రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నారా అని. కలిసిన మనసులు విరిగేలాచేస్తున్నారంతే.

 3. అన్నయ్య మీ తెలుగు సాహిత్యానికి నా అభినందనలు.
  కాని ఇక్కడ మీరు కొన్ని విషయాలు వదిలేసారు (తెలిసా, లేక తెలియకనా అనే విషయం నాకైతే తెలియదు!)
  కెసిఆర్ గాడు వెధవ నే … కాని మిగతా వాళ్ళని ఎందుకు వదిలి వేసారో నాకు అర్థం కాలేదు.

  తెరాస వాళ్ళ మెయిన్ అజెండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అని తెలిసి మరి 2004 లో వాళ్ళతో పొత్తు పెట్టుకున్న YSR గురించి ఎలా మరిచారండి ?? అప్పుడు YSR కి లగడపాటి కూడా సపోర్ట్ ఇచ్చాడు …. జనాలు కూడా votes వేసారు…
  2009 లో బాబు కూడా పెట్టుకున్నాడు పొత్తు … కెసిఆర్ నిరాహార దీక్ష చేస్తుంటే వెళ్లి మరి సెంట్రల్ బిల్లు పెడితే మేము ఓకే అంటాం అన్నాడు … తర్వాత ప్లేట్ తిప్పాడు… తానెలా గుర్తుకు రాలేదో మీకు!!!
  సామాజిక తెలంగాణ అన్న మెగా స్టార్ కూడా వెంటనే ప్లేట్ మార్చాడు…
  సెంట్రల్ హోం మినిస్టర్ కూడా ‘T’ కి ఓకే అన్నాడు.
  వీళ్ళందరినీ ఎందుకు వదిలారో మీకే తెలియాలి !!!!

  Though it’s an evergreen controversial topic, plz come up with facts from all sides, if you pen on this topic 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s