మౌనమై పాడనీ బాధగా (వేటూరికి అశ్రునివాళి)

మీ పాటకి వయసు లేదు కానీ మీకుందని
కాలం ఎంత ఘోరంగా గుర్తు చేసింది
ఇప్పుడు రాలుతున్న కన్నీటి చుక్క కూడా
మౌనంగా పాడుతోంది
ఏం పాడుతోందో తెలీదు
మీ పాటల సాహిత్యమూ గుర్తురావట్లేదు
నేను మాత్రం మౌనంలో మౌనంగా…

మరణం అనివార్యమైనట్టు
శోకమూ అనివార్యమే
పాటకర్త మీరు పోయాక
నాలోని మీ పాట కన్నీరౌతోంది

రోదసి నా ప్రేయసి అని మీరన్నది
ఇంత త్వరగా నిజమౌతుందనుకోలేదు
గాలినైపోతాను గగనానికి అన్నారు
చూడండి, ఇప్పుడు గాలి కూడా

మీ పాటలా మారిపోయింది

మీరు పోయాక ఇంక
జనం మరిచిపోయిన తెలుగు వాడుకలని
పనిగట్టుకుని గుర్తుచేసే వారెవరున్నారు?
అల్పమైన పాటల్లో అనల్పార్థాన్ని పొదిగి
కమర్షియల్ సినిమాల్లో కవిత్వాన్ని చిలికేవారెవరున్నారు?
తెలుగు సంస్కృతీ విలువలను, గుళ్ళూ గోపురాల కథలను
పాటల్లో పట్టించుకునే వారెవరున్నారు?
రాగాలను పేరుపెట్టి పలకరించే వారెవరున్నారు?
గత మహా కవులని స్మరించే వారెవరున్నారు?
ట్యూనుకి అలవోకగా పదాల పరికిణీ అల్లేవారెవరున్నారు?
మీలా రాసే వారు మీరు కాక మరెవరున్నారు?

మాకు అర్థం కాకపోయినా పర్వాలేదు,
నచ్చకపోయినా పర్వాలేదు,
మళ్ళీ ఒకసారి వచ్చి పాట రాయరూ?

మీ "అమ్మా ఓం నమామి" పాట స్ఫూర్తితో తొలి కవిత రాసిన నేను
ఇప్పుడు ఇలా నా తొలి ఎలిజీ రాయడం ఎంత బాధాకరం
మిమ్మల్ని కలవాలనుకున్నాను

కానీ నాకన్నా ముందే మరణం మిమ్మల్ని కలిసింది
నా మనసులో మాత్రం మీకు మరణం లేదు కనుక
మీ అంత్యక్రియలకు నేను హాజరు కాలేను
ఇంతకాలం మీ పాటల్లో బతుకుతున్న నన్ను
టీవీ లాక్కెళ్ళి నిజం ముందు కూర్చోపెడతానంటోంది
అందుకే…

దాన్నీ నేను చూడను

ప్రకటనలు

12 Comments

  1. phanindra garu ee vaartha vini naa manasanthaa edO okarini miss aipOyaamu anna baadha.

    Particular ga ee vaartha vinaganE vEturi community lO manam aayanni kaluddamu anukunnamu aa thread spuranaki vachchindi.chaala baadha anipinchindi aayanni manam kalavakmundE maraNam aayanni kalisindani.

    aayana maLLi kaviyai puttalani aasisthoo

  2. అనుకోకుండా చూసాను మీ బ్లాగివాళ. వేటూరి గారి గురించి అలా అలా చదువుకుపోతూ..వచ్చాను.

    మీ నివాళి కవిత నా మనసులోని భావానికి మల్లేనే ఉంది.

  3. స్పందించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నేను వేటూరి లేని నిజాన్ని ఇప్పుడిప్పుడే కొంత అంగీకరిస్తున్నాను. ఈ మహాకవి ప్రేరణ నేను రాయబోయే పాటల్లో నన్ను నడిపిస్తుందని నమ్ముతున్నాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s