బ్రతుకు శ్లోకం

ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో మా ఇంగ్లీష్ టీచరు రామచంద్రగారు, ఆఖరి క్లాసులో అందరికీ వీడ్కోలు తెలుపుతూ గడగడా ఒక పోయం చదివారు. కదిలించే లయతో ఎంతో ఉత్తేజకరమైన కవిత అది. నాకు ఎంతో నచ్చి తర్వాత ఆయన రూంకి వెళ్ళి ఆ కవితని నా డైరీలో రాసుకున్నాను. ఆ కవిత Longfellow రాసిన A Psalm of Life అన్నది http://www.bartleby.com/102/55.html

నన్ను ఎంతో ప్రభావితం చేసిన ఆ కవితకి తెలుగు అనువాదం ఇది. ఒరిజినల్‌తో పోలిస్తే ఈ అనువాదం తేలిపోతున్నా, ఇది కేవలం నా అభిమానానికి సూచికగా భావించాలి.

ఎవరన్నారు జీవితమంటే ఒక శూన్య స్వప్నమని?

నిదురలో మునిగితే చచ్చినట్టే

అనిపించినవన్నీ నిజం కావంతే!

 

జీవితం నిజమైనది

జీవితం సాధించదగినది

సమాధి దాని లక్ష్యం కాదు

మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోడానికి

మనిషి వట్టి శరీరం కాదు

 

అనుభవిస్తూ సాగడమో

శోకిస్తూ కూర్చోడమో

మన దారి కాదు

ప్రతి రేపూ

ఈ రోజు కంటే

ఒక అడుగు ముందుకేసేలా

కదిలి తీరాలి

 

లక్ష్యం సమున్నతమైనదనీ

సమయం కరిగిపోతోందనీ

తెలిసినా కూడా

ఓ ధీర హృదయమా

ఎందుకు లోలోపల ఇంకా

సన్నని చావు మేళా మోగిస్తున్నావ్?

 

ఈ విస్తృత ప్రపంచమనే యుద్ధ భూమిలో

ఈ క్షణకాలపు జీవిత మజిలీలో

గోవులమందలా సాగిపోవడమా

గోకుల కృష్ణునిలా వెలిగిపోవడమా

తేల్చుకో

 

తీయని రేపుని నమ్మొద్దు

చచ్చిన నిన్నను లేపొద్దు

ఇప్పటి క్షణాన్నే, ఈ రోజునే

గుండెలో పెట్టుకుని దేవుడిలా కొలుచుకో

 

అలా చూడు

ఎందరో మహనీయుల సమున్నత జీవితాలు

నిన్ను ఎత్తుకు ఎదగమని

తట్టి లేపడం లేదా?

ఏదీ

కాలం ఇసుకతెన్నెలపై

నీ కాలిగురుతుల వారసత్వం?

 

నీ కాలి గురుతులు

అవే కాలి గురుతులు

రేపు బ్రతుకు పోరాటంలో

నిస్పృహతో చితికిపోయిన జీవితానికి

ఆశా ధైర్యాలు

 

అందుకే పద

ఆకాశానికి నిచ్చెన వేద్దాం

ఏ విధినైనా జయిద్దాం

సాధిస్తూనే ఉందాం

ప్రయత్నిస్తూనే ఉందాం

కష్టపడడాన్నీ

కొంత సహనాన్నీ

నేర్చుకుందాం

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s