సంహారం

సద్గురువుగా పిలవబడే “జగ్గీ వాసుదేవ్”, ఆధ్యాత్మిక గురువే కాక కవి కూడా. మొదట్లో ఆయన కవిత్వం నాకు పెద్ద గొప్పగా అనిపించేది కాదు. Mystics Musings అనే పుస్తంలో అనుకుంటా ఆయన రాసిన Unmaking అనే కవిత మాత్రం నా మనసు లోతులని తాకింది. ఈ కవితలోని మార్మికత, గాఢత నన్ను కట్టిపడేసింది. సద్గురువు ఇంత బాగా రాస్తారా అని గతంలో నేను చదివిన ఆయన కవితలు మళ్ళీ చదివాను. సరళంగా కనిపించే భావాల వెనుక ఉన్న లోతు నాకు అప్పుడు తెలిసొచ్చింది. ఈ unmaking అన్న కవితైతే ఒక ఆధ్యాత్మిక అనుభూతే. ఇది నన్ను ఎంత కదిలించిందంటే తెలుగులో స్వేచ్ఛానువాదం చెయ్యకుండా ఉండలేకపోయాను. చేస్తున్నప్పుడు తెలిసింది ఇది నా స్థాయికి మించిన పని అని. ఏదో నాకు అర్థమైనది వచ్చిన భాషలో స్వేచ్ఛానువాదం చేశాను. తప్పులుంటే మన్నించాలి.

Unmaking

Those who feed upon the written word
Claim to know the limits of the boundless beyond
In the realm of the beyond
Clueless is the scholarly dud
The gloriousness of the written word
Is but the excreta of the deluded mind

If in you a raging longing I have made
Don’t you quench it with the delusions of the mind
Allow yourself to be unmade
Into the vastness of the beyond
You will be made

సంహారం

పుస్తకాలని మథించిన వాళ్ళు
ఎల్లలు లేని “అవతలి” అవధులు కొలిచామనుకుంటారు

కానీ
ఆ “అవతలి” రాజ్యంలో
ఎంతటి పండితుడైనా
దిక్కుతోచక చతికిలపడాల్సిందే

అక్షరవైభవమంతా
కేవలం భ్రాంతి చెందిన
హృదయపు గీతాలాపనే

నీలోని ఆధ్యాత్మిక తపనా దాహాన్ని
మనసు చూపే మరీచికల్లో తీర్చుకోవాలనుకోకు

నిన్ను నువ్వు పటాపంచలు చేసుకున్నప్పుడే
“అవతలి” లోని అనంతంలో
నీ అసలైన ఉనికి దొరుకుతుంది

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s