యోచనా తెలంగాణం

తెలంగాణా ఏర్పాటుకి మార్గం సుగమమయ్యిందని విన్నాక 2009 లో అనుకుంటా ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు ఆర్కుట్లో జరిగిన ఓ చర్చ గుర్తొచ్చింది. ఓ ఉస్మానియా కాలేజీ యువకుడు మంచి కవితలు రాస్తూ ఉండేవాడు. ఒకరోజు “నాలోని తెలంగాణా ఉద్యమ దీప్తిని వెలిగించిన మిత్రులకి శతకోటి వందనాలు అన్నాడు”. ఇది బానే ఉంది కానీ అప్పటినుంచి ఉద్యమంలో ఉన్న అవాంఛనీయ పోకడలని కూడా సమర్థించడం మొదలుపెట్టాడు. ద్వేషాన్ని “ధర్మాగ్రహం” అన్నాడు, విధ్వంసాన్ని “ఉద్యమావేశం” అన్నాడు, మన ప్రముఖులని మనమే తులనాడడం “ఆత్మగౌరవం” అన్నాడు. ఈ ఆంధ్రా-తెలంగాణా వేరువేరు అన్న భావమే నాకు నచ్చదు. ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడం తప్పు కాదు గానీ దాని కోసం అంతరాలు సృష్టించుకోవడం ఎందుకు? సరే, ఒక రోజు ఒకావిడ (తెలంగాణా ఆడపడుచే!) వాపోయింది – “ఉద్యమం పేరుచెప్పి బందుల మీద బందులు చేస్తున్నారని, పసిపాపకి పాలకోసం వెళితే షాపు మూతబడి ఉందనీ, పక్కన మద్యం దుకాణం మాత్రం తెరిచే ఉందనీ, దాన్ని ఎందుకు మూయించలేదని, ఉద్యమాలు చేసుకోవచ్చు కానీ ప్రజలకి కనీస అవసరాలకి కూడా కష్టాలు కలిగించడం దేనికని?” ప్రశ్నించింది. దీనికి ఆ యువకుడిచ్చిన సమాధానం – “లక్ష్యం సమున్నతం అయినప్పుడు చిన్న చిన్న కష్టాలు పడడం, త్యాగాలు చెయ్యడం తప్పదు సోదరీ!”.

నాకు ఈ పోకడలని చూసి చాలా బాధ కలిగింది. ఆ యువకుని సమాధానం చదివిన వెంటనే ఆఫీసులో అప్పటికప్పుడు ఈ కవిత పుట్టింది –

ఏది గెలుపో ఏది ఓటమో
కాలమే చెబుతుంది
తేల్చడానికి మనమెవరం?
 
మనసుల మధ్య అగాధాలంటూ ఏర్పడ్డాక
ఇక కలిసున్నా విడిపోయినా ఒకటే
విభజన రేఖపై పాతిన జండాయే మనకంటే నయం
తేడా చూపకండా
కాసేపు అటూ కాసేపు ఇటూ ఊగుతోంది!
 
నువ్వైనా నేనైనా కలకాలం ఉండం
ఏదో కొన్నాళ్ళు ఈ బ్రతుకు విహారం
మరి సెటిలర్ ఎవడు, నేటివ్ ఎవడు?
 
ఊళ్ళని తినే బకాసురులు అలానే ఉన్నారు
వంటోళ్ళు మారినా వంటే మారినా
మన ప్లేటులు మాత్రం ఖాళీ!
 
కన్నీళ్ళు తుడిచిన చేయి
గుండెల్లోని బాధని తీర్చిందో లేదో తెలిపేదెవరు?
పండగొచ్చిందని కట్టుకున్న మావిడాకు తోరణం
ఎన్నాళ్ళు వాడకుండా ఉంటుందో చెప్పేదెవరు?
 
కొన్నిసార్లు గెలుపు ఓటమికంటే భయపెడుతుంది
కొన్నిసార్లు ఓటమే గెలుపనిపిస్తుంది
మనమేం చెయ్యగలం ప్రార్థించడం తప్ప
గెలుపు గెలవాలని!

“The means are infinitely more important than the end” అన్న జిడ్డు కృష్ణమూర్తి వంటి తాత్త్వికుల మాటలు మనకి తలకెక్కలేదు. మనం కోరుకున్నది గొప్పదైతే, దాని సాధనకోసం ఏమి జరిగినా తప్పులేదనే ఇంకా మనం నమ్ముతాం, ఆవేశపడతాం. అవినీతి, అరాచకం వంటివి మనకి ఆవేశాన్ని కలిగించవు, కలిగించినా కదిలించవు, కదిలించినా ఉద్యమమై వికసించవు. కానీ “నాది” అనుకున్నదానికి అన్యాయం జరిగితే మాత్రం భగ్గున మండుతాం.  ఈ “నాది” అనేది కులం, మతం, ప్రాంతం, భాష ఇలా ఏదైనా కావొచ్చు. సీతారామశాస్త్రి ఈ వైఖరినే సిందూరం పాటలో ప్రశ్నించాడు-

కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడ లేని తెగువను చూపి తగువకు లేస్తారే, జనాలు తలలర్పిస్తారే
సమూహ క్షేమం పట్టని స్వార్ధపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే తెలిసీ భుజం కలిపిరారే
అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి?   పోరి ఏమిటి సాధించాలి?
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సిందూరం
జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా ఓ అనాధ భారతమా

కొన్నిసార్లు చిన్న గెలుపులు మనం సాధించాల్సిన అసలైన విజయాలని మరుగుపరుస్తాయి. సిద్ధాంతాల మత్తులో, ఆవేశపు జోరులో కొన్నిసార్లు దిగజారుడుతనం కూడా గొప్పగానే తోస్తుంది. అందుకే బుద్ధివక్రతని పారద్రోలమనీ, సన్మార్గంలో నడపమనీ ప్రార్థించడం అవసరం.

కొన్నిసార్లు గెలుపు ఓటమికంటే భయపెడుతుంది
కొన్నిసార్లు ఓటమే గెలుపనిపిస్తుంది
మనమేం చెయ్యగలం ప్రార్థించడం తప్ప
గెలుపు గెలవాలని!

సర్వే జనాః సుఖినో భవంతు!

ప్రకటనలు

9 Comments

  1. గతజలసేతుబంధనం ఆపేసి ఆంధ్రసీమ పునర్నిర్మాణం గురించి మనం ఆలోచించాలి!ఒంగోలును ఆంధ్ర సీమకు రాజధానిగా చేసి దానిని హైదరాబాద్ బాబులాగా తీర్చిదిద్దుదాం!ఆంధ్రసీమ తెలంగాణా ప్రజలం భుజం భుజం కలుపుదాం!గుండె గుండె కలుపుదాం!ఇది అందరు తెలుగుల బాధ్యత!

  2. The same factors (demolishing statues, burning buses, forced bandhs with liquor stores & movies still open, rasta rokos, obstructing movie stars, attacking party offices/leaders etc.) are visible in the last few days.

    Those who criticized such things then are strangely silent today. Those who ridiculed Telangana vanta varpu are lining up to eat at the event organized in Vijayawada. Looks like Andhras have different rules for themselves.

    1. This post is not a criticism of Telangana movement or people. It is a criticism of an attitude. The example shown is of a Telangana youth but my intention is not to single out “Telangana folks”. The very fact that now even Andhra people show the same hatred and stupidity shows that the problem is widespread. It is time we do something about this, starting with ourselves. That is the intention of the poem.

      1. I did not criticize you. I only pointed out the cynical hypocrisy of politicians. Just compare the amount of cacophony after the Tankbund incident to the deafening silence on the destruction of India & Rajeev statues. Even staunch Congressmen like Lagadapati, Undavalli etc. did not criticize it.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s