The Intellectual!

హలో హలో!!
నేను చెప్పేది విను
ఎందుకంటే
నేనో మేధావిని!
క్రిటిక్‌ని
ఇంటలెక్చ్యువల్‌ని
…నువ్వో అజ్ఞానివి!

సత్యం నా ముందు
చేతులు కట్టుకు నిలుచుని
“చిత్తం దొరా” అంటుంది!
కాబట్టి నా ప్రతి మాటా
వేదవాక్కు కాక మరేమిటి?

నాకు కనిపించేవే నిజాలు
మిగతావన్నీ అర్థరహితాలూ, అబద్ధాలు!
నా చూపు మందగించింది అంటావా?
Your Honour, ఈ పర్సనల్ క్రిటిసిజంని
తీవ్రంగా ఖండిస్తున్నాను!

facts తో football ఆడుకుంటాను నేను
నువ్వు బూజు పట్టిన భావజాలపు అపోహల్లో జీవిస్తావ్
“చంద్రుడు వెన్నెలకన్నెకి కన్ను కొడుతున్నాడు” అని నేనంటే
అది fact కాదు నా interpretation అంటావా?
వాట్ నాన్సెన్స్?

సముద్రాన్ని మథించిన వాడిని నేను
నువ్వు గ్లాసుడు నీళ్ళు తాగేసి తెగ గోల పెడతావ్!
డామిట్!
experts కి విలువ లేకుండా పోయింది
ప్రతి అడ్డమైన వాడూ వాగేస్తున్నాడు

బుద్ధున్న వాళ్ళందరూ,
మంచి వాళ్ళందరూ,
నాతో ఏకీభవించి తీరతారు!
సో obviously, నేనే కరెక్ట్!
What do you say?

నేను తానా అంటే తందానా అనేవాళ్ళు ఎందరో
అబ్బబ్బో నాకు వీర ఫాలోయింగ్!
చూశావా నిజానికి ఉన్న బలం?
తెలివికి కట్టిన పట్టం?

గట్టిగా మాట్లాడితే
నీలాంటి అల్లాటప్పాగాడితో నాకేం పనప్పా?
నీకు సమాధానం చెప్పడం
పెద్ద టైంవేస్టు అబ్బా!

హలో హలో!!
వింటున్నావా?
ఇదే మన దేశానికి పట్టిన ఖర్మ
నీలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా ఎక్కదు!

ప్రకటనలు

2 Comments

 1. 🙂 ఇలాంటివి రోజూ చూస్తున్నాం

  FB లొనే రోజంతా ఉంటూ, సోషల్ నెట్వర్కింగ్ వల్ల జనాలు జీవితం ఎలా కోల్పోతున్నారో లెక్చర్లిస్తారు కొందరు. వాళ్ళేస్థితిలో ఉన్నారో వాళ్ళకే తెలియదనిపిస్తుంటుంది.

  ఎవరైనా అనాధలకి సహాయం చేసా అని పోస్టేస్తే, ఆనాధలకి కాదురా అమ్మ, నాన్నలకి సహాయం చెయ్యండి అని కామెంట్స్ పెడతారు.

  ఎవడైనా ఘనంగా పెళ్ళి చేసుకున్నాం అంటే వచ్చి అంత ఆర్భాటం అవసరమా? ఈ డబ్బుతో ఎందరి అనాధల ఆకలి తీర్చొచ్చో అంటారు.

  నోస్టాలిజిక్ పోస్ట్ వేస్తే, వాస్తవంలో బ్రతకాలి అంటారు. రియలిస్టిక్ పోస్ట్ వేస్తే ఈ జెనరేషన్‌కి సమాజం, సంప్రదాయం పట్టదు అంటారు.

  సాఫ్టీలందరూ ఎ.సి.ల్లో సుఖపడిపోతూ, తెల్లవాళ్ళకి ఊడిగం చేస్తున్నామని వీళ్ళ ఫీలింగ్. పొలాల్లోకి వచ్చి దున్నితే చెమట కారితే కష్టం తెలుస్తుంది అని ఉపన్యాసాలు.

  “నువ్వు దున్నరా, నేను పొలం చూపిస్తా” అనాలనిపిస్తుంది నాకయితే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s