పేరు లేని పాట

ఈ పాటకి పేరు లేదు
మౌనంగా పరికిస్తే
మధురంగా పలకరిస్తుంది
గుండెవాకిలి తలుపు తీస్తే
వచ్చివాలి కూతపెడుతుంది!

నా మటుకు నేను పోతూ ఉంటే
అనుకోకుండా తారసపడింది
ఎప్పుడూ ఇంతే
అనుకున్న వాటి కంటే
అనుకోనివే జీవితంలో మెరుస్తాయ్

మనసుతో వచ్చిన చిక్కేంటంటే
ప్రతిదానికీ ఓ పేరు పెట్టేస్తుంది
గుప్పుమంటే వలపనీ
గొల్లుమంటే ఏడుపనీ
ఫక్కుమంటే నవ్వనీ
చివుక్కుమంటే బాధనీ…

బ్రతుకుబుక్కంతా psuedonym లతో నిండిపోయినప్పుడు
Facebook స్టేటస్సులే
జీవితానికి కామెంటరీగా మిగులుతాయ్

అందుకే ఈ పాటకి నేను పేరు పెట్టలేదు
అది భూపాలమో హిందోళమో
ఇంకో రాగమో తెలీదు…

రాగమే నేనైనప్పుడు
పేరుతో పనిలేదు

2 Comments

వ్యాఖ్యానించండి