నిశ్శబ్ద వసంతం

పైకి చెప్పకు,పదిలంగా దాచేసుకో
నీ కలలనీ, నీ అనుభూతులనీ!
మసకచీకట్లను ఛేదిస్తూ
నింగికి తారలెగసినట్టు
మనసు లోతులనుంచి
వెలుగురవ్వలు విరజిమ్మనియ్!
దర్శించి పరవశించిపో
మాట పెగలనీకు!

ఎవరు వినగలరు నీ గుండెలో గీతాన్ని?
నీ మనసు సెలయేటి గలగలల్ని?
నీ లోలోపలి కలకలాన్ని?
నిన్ను నువ్వు “మాట”గా పారేసుకున్న వేళ
నీ ఉనికే అబద్ధమైపోతుంది
ఇక్కడే, ఈ మానససరోవరంలోనే
మాటల మలినం అంటక ముందే
అనంతాన్ని దోసిలిపట్టుకో

మనసుతోటలో గూడు కట్టుకుని
నీదైన తలపు సామ్రాజ్యంలో తలదాచుకో!
వెలుగుచూడని వెన్నెలతళుకులు కొన్నీ
బ్రతుకు రొదలో తప్పిపోయిన కవితలు కొన్నీ
పరదా మాటునుండీ పైకొచ్చి
ప్రియగీతం పాడే వేళ
మౌన రసాస్వాదనవై మైమరచిపో
ష్! మాట్లాడకు!!

(Fyodor Tyutchev కవిత Silentium కి తెలుగు అనువాదం. కినిగె జనవరి 2014 కవితానువాదాల పోటీ కోసం చేసినది)
ప్రకటనలు

8 Comments

 1. ఫణీంద్రగారూ,

  కవిత చాలా బాగుంది. నేనే అడుగుదామనుకుంటున్నాను, ముఖ్యంగా రెండు, మూడవ పాదాలు అద్భుతంగా ఉన్నాయి.
  “నిన్ను నువ్వు “మాట”గా పారేసుకున్న వేళ
  నీ ఉనికే అబద్ధమైపోతుంది
  ఇక్కడే, ఈ మానససరోవరంలోనే
  మాటల మలినం అంటక ముందే
  అనంతాన్ని దోసిలిపట్టుకో”

  ఇవి మళ్ళీ మళ్ళీ చదవాలనిపించిన వాక్యాలు. అనువాదాలు నిజంగా కష్టమే కానీ, మీ కవితలో ఉన్న ప్రవాహవేగం అనువాదమన్న స్పృహే కలుగకుండా చేసింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s