పిల్లలు

ఖలీల్ జీబ్రాన్ రాసిన “ప్రొఫెట్” పుస్తకం గొప్ప ఆధ్యాత్మిక గ్రంధంగా పేరుపొందింది. “యండమూరి వీరేంద్రనాథ్” తన పుస్తకం “పడమటి కోయిల పల్లవి” లో ఈ పుస్తకంలోని కొన్ని కవితలకి చేసిన అనుసృజన ద్వారా నాకు “ప్రొఫెట్” గురించి తెలిసింది. మూలంలో చూస్తే గాఢమైన భావం ఎక్కువగా కనిపించింది కవిత్వం కన్నా. యండమూరి అనువాదంలో కవిత్వం చొప్పించాలనే తాపత్రయం ఎక్కువ కనిపించింది. పొడి పొడి మాటలలో మూలానికి దగ్గరగా అనువదిస్తే ఎలా ఉంటుందో చూద్దామని నేను ఎప్పుడో 2005లో ఓ ప్రయత్నం చేసి “పిల్లలు”, “పెళ్లి” అనే కవితలని అనువదించాను. అందులో “పిల్లలు” కవిత ఇలా వచ్చింది –

మీ పిల్లలు మీ పిల్లలు కారు!
బ్రతుకు తనకై తాను పడే తపనకు వాళ్ళు ప్రతిరూపాలు
మీ ద్వారా పుడతారు కానీ మీ నుండి కాదు
మీతోనే ఉంటారు కానీ మీ సొంతం కారు

వాళ్ళకి మీ ప్రేమని పంచండి, మీ ఆలోచనలను కాదు
ఎందుకంటే వాళ్ళకీ సొంత ఆలోచనలుంటాయ్
వాళ్ళ దేహాలను సాకండి, మనసులని కాదు
ఎందుకంటే రేపటి సీమలో మెలిగే వాళ్ళ మనసుని మీరు కలలో సైతం దర్శించలేరు
వాళ్ళలా మారడానికి ప్రయత్నించండి కానీ మీలా వాళ్ళని తయ్యారు చెయ్యకండి!
ఎందుకంటే బ్రతుకు వెనక్కి నడవదు, నిన్నటితో ఊగిసలాడుతూ కూర్చోదు!

మిమ్మల్ని విల్లుగా చేసి సంధించిన బాణాలు వాళ్ళు!
అనంతమైన బాటనున్న లక్ష్యానికి గురి చూసి
బాణాలు వేగంగా దూరంగా సాగేలా
విలుకాడు తన బలంతో మిమ్మల్ని వంచుతాడు
ఆనందంగా ఆయన చేతిలో వంగి సహకరించండి
ఎందుకంటే దూసుకు పోయే బాణంతో పాటూ
స్థిరంగా సంధించిన వింటిని కూడా
ఆయన ప్రేమిస్తాడు!

– 23.04.05

ప్రకటనలు

4 Comments

  1. నీ అనువాదం హృద్యంగా ఉంది, సోదరా ఫణీంద్రా! “The Prophet” నేను కొద్దిగా (మాత్రమే) చదివాను కానీ నా దగ్గఱ పుస్తకం లేదు. దీని అసలు కవిత కూడా పంచుకోరాదూ? నేనూ ప్రయత్నిస్తాను. 🙂

    1. థాంక్స్ అండీ! మొత్తం ప్రొఫెట్ పుస్తకాన్ని అనువదించడం కష్టమే! నేను అందులోని
      marriage అనే కవితను కూడా అనువదించాను. ఎప్పుడైనా షేర్ చేస్తాను!

      On Thu, Nov 6, 2014 at 4:57 AM, అక్షర శిక్షలు!
      wrote:

      >

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s