జీవన సంగ్రామ రాముడు!

(బ్యాంక్ ఆఫ్ బరోడాలో పనిచేసి రిటైర్ అయిన నాన్న కె.రామమూర్తి పదవీవిరమణ సందర్భంగా రాసిన కవిత)

SONY DSC
Dad’s retirement

కొన్ని పదవులు విరమించడం అంటూ ఉండదు
జీవితాంతం వరించడమే
ముప్ఫై తొమ్మిదేళ్ళ బ్యాంకు ఉద్యోగానికి
మీరు నేటితో ముగింపు పలికినా
మంచిని నేర్పే పెద్దరికానికి విరామమంటూ ఉండదు!

మిమ్మల్ని కన్నప్పుడు నాన్నమ్మా తాతయ్యలకి తెలియదేమో
తమ కన్నబిడ్డే ఇంటివెలుగౌతాడని
చిట్టి చేతులు ఇంటిపనులలో చేదోడువాదోడులవుతాయని
మేలుతలపులు ఇంటిల్లిపాదికీ మార్గదర్శకాలౌతాయని
వీధిదీపం కింద శ్రద్ధగా చదువుకున్న చదువులు
ఇల్లంతా ముసిరిన దారిద్ర్య చీకట్లు మాపే దీపమౌతాయని…

తండ్రి మాణిక్య శర్మ పేరు నిలిపిన
మాణిక్యం లాంటి పెద్దకొడుకు మీరు
తల్లి కమలాదేవి కన్న కవితై
సంస్కార కమలమై విరబూశారు
ఇంధ్రధనుస్సులోని ఏడు రంగుల్లా
అందంగా కలిసి విరిసిన
ఏడ్గురు ముత్యాల్లో మీరో ఆణిముత్యం
మమతానురాగాల ఆత్మీయగీతానికి
పెద్దన్నయ్యగా మీ సారధ్యం
పెద్దదిక్కులా మీ సాంగత్యం
అందుకున్న ఆ అనుబంధం
మధురాతి మధురం!
అందరికీ దొరకని వరం!

కుటుంబ బాధ్యత కోసం
ఎమెస్సీ చదువుని వదిలి
బరోడా బ్యాంకుని మీరు చేరినప్పుడు
చదువులమ్మ చింతించినా
బరోడా బ్యాంకు లాభపడింది!!
మీ అకుంఠిత దీక్ష, కార్యనిర్వహణా దక్షతా డిపాజిట్లుగా
మీ స్నేహశీలతా, వినయసంపన్నతా స్కీములుగా
మూడు లోన్లు ఆరు కష్టమర్లతో
బరోడా బ్యాంకు వర్ధిల్లింది!
బ్యాంకు కోసం మీరు పడ్డ తాపత్రయం
మీ కోసం మీరే పడలేదేమో
అందుకే మీకు బ్యాంకు కేవలం
ఓ ఉద్యోగం కాదు
అది మీ లక్షణమై మీ వ్యక్తిత్వంలో భాగమైపోయింది

రాముడు మీ పేరులోనే కాదు
మీ తీరులోనూ ఉన్నాడు
అయోధ్యా వైభవాన్ని వీడి వనవాసం చేసిన నాటి రాముడిలా
ఆడంబరాలు కోరని, విలువల సహచర్యాన్ని వీడని నడత మీది
వైరుధ్యాల నడుమ స్నేహవారధులు కట్టిన ఘనత మీది
వ్యక్తిలోని లోపాలను వదిలి సుగుణాలను చూసిన సహృదయత మీది
కుటుంబం కోసం అహరహం తపించే ప్రేమ మీది
సంబంధ బాంధవ్యాలకు స్నేహసౌరభాలకు ప్రాణమిచ్చే విలువ మీది
అరుదైన సంస్కారం మీది
నిలువెత్తు నిస్వార్థం మీది
ప్రియమైన హితవాక్యం మీది
మీదైన బ్రతుకంతా మాది!!

మీరు మాకిచ్చిన స్ఫూర్తే మీకు కీర్తి
మా గుండెల్లో కొలువే
మీకు రెటైర్మెంటు లేని పదవి!

-30th November, 2015

ప్రకటనలు

2 Comments

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s