సత్యం విరిసే పూదోట!

ఆయన్ని చేరడానికి
నేను తెలివితో వేసిన నిచ్చెనలన్నీ
నిష్ప్రయోజనమయ్యాయి
కానీ
ప్రయత్నాలని పరిత్యజించిన మరుక్షణం
అవరోధాలన్నీ మటుమాయం!

ఆయన తనకు తానే
కరుణతో సాక్షాత్కరించాడు!
అంతే తప్ప ఆయన్ని తెలుసుకోవడం నా తరమా?
నా తెలివి గుమ్మం వరకే నడిపించింది
ఆయన కటాక్షమే ద్వారాన్ని తెరిచింది!

కానీ నిన్ను నీవు తెలుసుకోనంత వరకూ
ఆయన్ని ఎలా తెలుసుకోగలవు?

ఉన్నది ఒక్కటే
ఎక్కువా లేదు, తక్కువా లేదు!
తప్పల్లా రెంటిని చూడడమే
ఏకత్వంలో ఏ దోషమూ లేదు

నీ అసలైన మార్గం
హృదయపుటద్దాన్ని మెరుగు పెట్టుకోవడం
మనసుతో విరోధం కాదు!
దుమ్ముగా పట్టిన
ఆత్మవంచననీ, అపనమ్మకాన్నీ తుడిచిపెట్టి
నిశ్చయత్వంతో, నిష్కళంక విశ్వాసంతో
అద్దాన్ని మెరిపించు!

నీ చుట్టూ నువ్వు ఏర్పరుచున్న
బంధనాల నుంచి బయటపడు!
మట్టి దేహంపైన మమకారాన్ని విడిచిపెట్టు!
దేహం అంధకారం, హృదయం కాంతిమయం
దేహం కేవలం ఎరువు, హృదయం పూలు పూసే తరువు!

హకిం సనాయ్, “హదీకా” నుండి

(ఓషో “యూనియో మిస్టికా” (Unio Mystica) పేరుతో రెండు పుస్తకాలలో చేసిన గొప్ప వ్యాఖ్యానం వల్ల సనాయ్ గురించి తెలిసింది. సూఫీజం అంటే “రూమీ” వంటి గొప్ప కవుల పేర్లు వినిపిస్తాయి కానీ సనాయ్ పెద్దగా ఎవరికీ తెలియడు. రూమీ కంటే ముందువాడైన, రూమీని ఎంతో ప్రభావితం చేసిన సనాయ్ గురించి ప్రాచుర్యంలో ఉన్న కథ నాకు గొప్పగా తోస్తుంది. ఓషో పుస్తకంలోని మొదటి కవితకి నేను చేసిన అనువాదం ఇది. ఇంగ్లీషు మూలాన్ని ఇక్కడ చూడొచ్చు. నేను మూలాన్ని యథాతథంగా అనువదించలేదు.  బొల్లోజు బాబా గారు కొన్ని సనాయ్ కవితలకి (ఈ కవితతో సహా) చేసిన అనువాదాలు మూలానికి విధేయంగా ఉన్నాయి)

ప్రకటనలు

5 Comments

  1. పేరు చాలా బావుంది సత్యం విరిసే పూదోట అని. చదుతుంటే గీతాంజలి గుర్తొచ్చింది. బహుశా భావ సామ్యం ఉందేమో రెంటికీ. మంచి ప్రయత్నం.

    1. హదీకా కి “Walled Garden of Truth అన్నది ఆంగ్ల అనువాదం. దానిని యథాతథంగా అనువదించడం చేత గాక “సత్యం విరిసే పూదోట” అన్నాను!

      గీతాంజలి తో సామ్యం ఉండడం నిజమే అనిపిస్తోంది నువ్వు చెప్పాక. సూఫీతత్త్వానికీ హైందవ భక్తితత్త్వానికీ కొంత సామ్యం ఉంది కాబోలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s