కొన్ని హైకూలు, మినీ కవితలు!

ఈ మధ్య ఇస్మాయిల్ గారు హైకూ ప్రక్రియ గూర్చి రాసిన “చంద్రుణ్ణి చూపే వేలు” అన్న అద్భుత వ్యాసమూ, కొన్ని జెన్ హైకూలు చదవడం వల్ల కలిగిన ప్రేరణతో కొన్ని హైకూ అనువాదాలు చేశాను, కొన్ని రాశాను (నేను రాసినవి హైకూలు అనుకోను, అవి ప్రయత్నం మాత్రమే!). ఇవి కాక రెండు మినీ కవితలూ కలిపి ఈ వ్యాసం!

అనువాదాలు

1. రాలిన పువ్వు
కొమ్మెక్కి మళ్ళీ పూసింది
సీతాకోక చిలక!

– ఓ జెన్ హైకూకి నా అనువాదం

2. దొంగ
వదిలెళ్ళిపోయాడు
కిటికీలో చందమామని

– తన పూరిల్లుని ఓ దొంగ దోచుకెళ్ళాక జెన్ గురువు Ryokan రాసిన హైకూ

3. పూల సుగంధాన్ని తెలుసుకోవాలంటే
పూల వెంట పడకు!
చెట్టుని ఆశ్రయించు
నీలోనూ పువ్వులు విరబూస్తాయి!

– హైకూ మహాకవి బషో వాక్యాల స్ఫూర్తితో

(Original lines as translated in the book “The Essential Haiku”

Learn about the pines from the pine, and about bamboo from the bamboo.
Don’t follow in the footsteps of the old poets, seek what they sought. )

నా రచనలు

1. ముచ్చటైన చిట్టి చేతులు
మురిపంగా కట్టిన ఇసుక సౌధం
ముంచెత్తిపోయే కెరటం

2. ఎప్పుడు దోచుకెళతాడో ఏమో
బుల్లికృష్ణుడు
నా తలపు వెన్నని!

కృష్ణాష్టమి సందర్భంగా

3. గలగల నవ్వులతో
మౌనాన్ని పంచింది
సెలయేరు!

4. చేతిలో సిగరెట్టు
తలపులో రగులుతుంది
సిరివెన్నెల!

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిపై సరదాగా! (ఆయనిప్పుడు సిగరెట్లు మానేశారని తెలిసింది)

5. నువ్వు దోసిలిపట్టి ఆహ్వానించి ఉంటే
తాకిన ప్రతి అనుభూతి చినుకూ
ఓ ముత్యంలా మారి ఉండేది!

కానీ జల్లెడపట్టి
నీకు నచ్చినవే ఏరుకున్నప్పుడు
నీరుగారిన ఆశలే నీకు దక్కేది!

ఓ మనసా ఎంత వెర్రిదానివే!

జిడ్డు కృష్ణమూర్తి “Your mind is like a sieve(జల్లెడ)” అన్న వాక్యం ప్రేరణతో…

(The original lines that inspired this poem are from Pupul Jayakar‘s auto-biography on Krishnamurti. He wrote letters to a young friend who came to him wounded in body and mind. An excerpt from these letters contains this analogy of “sieve” for mind –

“To allow the free flow of life, without any residue being left, is real awareness. The human mind is like a sieve which holds some things and lets others go. What it holds is the size of its own desires; and desires, however profound, vast noble, are small, are petty, for desire is a thing of the mind. Not to retain, but to have the freedom of life to flow without restraint, without choice, is complete awareness. We are always choosing or holding, choosing the things that have significance and everlastingly holding on to them. This we call experience, and the multiplication of experiences we call the richness of life. The richness of life is the freedom from the accumulation of experience. The experience that remains, that is held, prevents that state in which the known is not. The known is not the treasure, but the mind clings to it and thereby destroys or defiles the unknown.” )

ప్రకటనలు

2 Comments

  1. bagunnai phanindra !

    I don’t know exactly what to say…. I can only pray for you, bless you that you may consciously experience the grace of Divinity and express it through you –in your every day life. I don’t know what it means exactly for you– but this is the best thought I can have for you.

    Thank you Phanindra for being what you are !!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s