ప్రభాసమాయె!

సిలికానాంధ్ర మనబడి అమెరికాలో ఉన్న పిల్లలకి తెలుగు నేర్పడానికి విశేషమైన కృషి చేస్తోంది. కేవలం తెలుగు రాయడం, చదవడం, మాట్లాడడం నేర్పడమే కాక తెలుగు సాహిత్యాన్ని, సంస్కృతిని పిల్లలకి అందించి “సంపూర్ణమైన” తెలుగును నేర్పుతోంది. మా అమ్మాయిని మొదటి తరగతి “ప్రవేశం” లో చేర్పించాను.  కానీ నేను కూడా ఐదవదీ, ఆఖరిదీ అయిన “ప్రభాసం” తరగతిని బోధిస్తానని అనుకోలేదు!

నాకు తెలుగంటే ఇష్టమే కానీ ఎప్పుడూ తెలుగు పాఠాలు బోధించలేదు, అసలు ఆ మాటకొస్తే ఎప్పుడూ ఏదీ బోధించలేదు.  ఇది అనుకోకుండా వచ్చిన అదృష్టమే!  నేను ఎప్పుడో చదువుకున్న ఛందస్సు, అలంకారాలు వంటి వ్యాకరణాంశాలు మళ్ళీ నేర్చుకోవడమే కాక, పారిజాతాపహరణం, పోతన భాగవతం వంటి గొప్ప కావ్యాల/పురాణాల లోని అందమైన తెలుగు పద్యాలు కంఠస్థం చెయ్యగలగడం అదృష్టం కాక మరేమిటి?

ప్రభాసంలో మేము తేటగీతి పద్యలక్షణాలు నేర్చుకుంటాం. నేను ఎప్పుడూ పద్యాలు రాసింది లేదు. ఈ మధ్య కొన్ని కంద పద్యాలు రాసే ప్రయత్నం చేసినా తేటగీతి ఎప్పుడూ రాయలేదు. ఓ తేటగీతి పద్యంలో మా క్లాసులో ఉన్న 11 మంది పిల్లల పేర్లన్నీ వచ్చేటట్టు రాసి ఆ పద్యంతో పిల్లలకి తేటగీతి పద్యలక్షణాలు చెప్తే ఎలా ఉంటుందన్న ఒక ఆలోచన కలిగింది. సరే అని మొదలెట్టాక, ఇది అనుకున్నంత సులువు కాదని తెలిసింది. కానీ ఎలాగోలా పద్యాన్ని అయిందనిపించాను. ఆ పద్యం ఇది –

శ్రీక, తరుణి, మానసి, శివ రామ్, కరణులు
కలిసి; వేంకట సాయి, శ్రీకరులు కూడి;
హర్షితయును, శ్రీలేఖయు అమరి; శబ్ది
క సహ, అక్షిత్ యు చేరి; ప్రభాసమాయె

నా సహ ఉపాధ్యాయులు శ్రీనివాస్ గారితో కలిసి మా ప్రభాసం విద్యార్థులకి తెలుగు బోధించడం ఒక గొప్ప అనుభవం! పిల్లలు ఎంత నేర్చుకున్నారో తెలియదు కానీ నేను చాలా నేర్చుకున్నాను – తెలుగు భాషాసంగతులతో పాటూ పిల్లలకి ఎలా చెప్పాలో కూడా! ఈ అనుభవంతో వచ్చే యేడు మరింత మెరుగ్గా తెలుగు నేర్పగలమని ఆశిస్తున్నాను!

IMG_2690
ఎడమ నుంచి కుడికి – సహ ఉపాధ్యాయులు శ్రీనివాస్ గారు, కరణ్, హర్షిత, శబ్దిక, శ్రీలేఖ, మానసి, తరుణి, శ్రీకర్, వెంకట సాయి, శివ రామ్, అక్షిత్, శ్రీక, నేను

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s